హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోశాల నిర్మాణానికి మంత్రి భూమిపూజ

అన్నమయ్య: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన సొంత వ్యవసాయ క్షేత్రంలో గోశాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. చిన్నమండెం–సంబేపల్లి మండలాల సరిహద్దులోని నారాయణరెడ్డిగారిపల్లె, కొత్తపల్లె గ్రామాల పరిధిలో గోమాతల సంరక్షణ కోసం తన సొంత భూమిని కేటాయించారు. ప్రజా జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ గోమాతల సేవకు ప్రాధాన్యతనిస్తూ గోశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.