హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ సరళిని పర్యవేక్షించిన జేసీ

ఎన్టీఆర్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ విజయవాడ కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని, దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.