హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉదయం 11 గంటలకు 68.35 శాతం పోలింగ్

PLD జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. సత్తెనపల్లి డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో 494 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 1,26,214 మంది ఓటర్లకు గాను ఉదయం 11 గంటల వరకు 86,266 మంది ఓటు వేయడంతో 68.35 శాతం పోలింగ్ నమోదైంది. మండలాల వారీగా ముప్పాళ్లలో 73.75 శాతంతో అత్యధికం, రాజుపాలెంలో 62.17 శాతంతో అత్యల్ప పోలింగ్ నమోదైంది.