హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటన.. ఎలమంచిలిలో ముమ్మరంగా శానిటేషన్ పనులు

అనకాపల్లి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం ఎలమంచిలిలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆదివారం ఏర్పాట్లను వేగవంతం చేశారు. సీఎం పర్యటించే మార్గాలు, సభా ప్రాంగణం పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త, పిచ్చిమొక్కలను సిబ్బంది తొలగిస్తూ పారిశుధ్య పనులు చేపడుతున్నారు.