హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సతీమణితో కలిసి ఓటు వేసిన ఎమ్మెల్యే

కృష్ణా: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పామర్రు జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తన సతీమణితో కలిసి ఆదివారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.