హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీతగుంట పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎస్పీ

అల్లూరి: పెదబయలు మండలంలోని సీతగుంట పోలింగ్ కేంద్రాన్ని పాడేరు డీఎస్పీ వీ. రాజసింహారెడ్డి ఆదివారం తనిఖీ చేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. భద్రతా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.