హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జర్రావారిపల్లిలో రిగ్గింగ్ కలకలం!

అన్నమయ్య: వాల్మీకిపురం మండలం జర్రావారిపల్లి 6వ వార్డు పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ ఆరోపణలతో గందరగోళం నెలకొంది. అధికార పార్టీకి చెందిన కొందరు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ఏజెంట్లు ఆరోపించడంతో వైసీపీ మద్దతు అభ్యర్థులు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు.