ప్రకాశం: అర్ధవీడు మండలం బోగోలు గ్రామంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ వేళ ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్న వర్గాల మద్దతుదారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పోలింగ్ కేంద్రం వద్ద అదనపు బలగాలను మోహరించి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల వేళ బోగోలు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత


