KDP: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తొండూరు మండలంలో ఆదివారం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. తొండూరు మండలంలోని గుండ్లమడుగు, తేలూరు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో నిలబడి ప్రజలు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
తొండూరులో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్


