హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేవరపల్లిలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన తహసీల్దార్

E.G: దేవరపల్లి మండలంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియను తహసీల్దార్ రాజబాబు ఆదివారం పరిశీలించారు. దేవరపల్లి హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ నిర్వహణ, ఓటర్ల రాక, కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా చూడాలని సూచించారు.