హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తణుకులో మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

W.G: తణుకు మండలం పరిధిలో మొత్తం తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉండగా, వీటిలో మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వేల్పూరు, కొమరవరం, యర్రాయిచెరువు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. దీంతో ఆయా మూడు గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించడం లేదు. మిగిలిన ఆరు గ్రామ పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది.