హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కట్టెల సాయంతో వచ్చి ఓటేసిన వృద్ధులు

ATP: గార్లదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వయోభారాన్ని సైతం లెక్కచేయకుండా వృద్ధులు కట్టెల సాయంతో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రజాస్వామ్య పండుగలో తమ బాధ్యతను నెరవేరుస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వృద్ధుల చైతన్యాన్ని పలువురు అభినందిస్తున్నారు.