హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 14.39 శాతం పోలింగ్

ఎన్టీఆర్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 10 గంటల వరకు 44,246 ఓట్లు పోలవగా, 14.39 శాతం నమోదైంది. జిల్లాలో 7 మండలాల పరిధిలో 128 పంచాయతీలకు 1,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3,07,582 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ వివరాలను జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ వెల్లడించారు.