హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ సరళిని పరిశీలించిన అడిషనల్ ఎస్పీ

SS: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల్లో పోలింగ్ సరళిని అడిషనల్ ఎస్పీ అంకిత సురానా ఐపీఎస్ ఆదివారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత, ఓటర్ల రాకపోకలు, క్యూ లైన్ల నిర్వహణను సమీక్షించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగే ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా నిర్వహించేలా పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు.