హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో ఉత్కంఠ

కృష్ణా: గుడివాడ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో పట్టణ ప్రజల్లో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈసారి మున్సిపల్ పీఠాన్ని ఏ పార్టీ దక్కించుకుంటుంది? ప్రజల మద్దతు ఎవరికి లభించింది? అనే అంశాలపై రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లోనూ ఆదివారం చర్చ జరుగుతోంది.కౌంటింగ్ రోజు కోసం అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.