ELR: నారాయణపురంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కుపై వృద్ధురాలు చూపిన చైతన్యం అందరినీ ఆకట్టుకుంది. 70 ఏళ్లు పైబడినప్పటికీ కుటుంబ సభ్యుల సహాయంతో పోలింగ్ కేంద్రానికి చేరుకుని సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలి అని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
70 ఏళ్లు దాటినా ఓటు వేయాలన్న సంకల్పం


