హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

విశాఖ: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రంపై ఏర్పడనున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 30వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.