KRNL: పెద్దకడబూరు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదనే విషయంపై ఇరు పార్టీల నాయకులు పరస్పరం వాదనకు దిగారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి కొద్దిసేపు అక్కడ స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు దిగి ఇరు పార్టీల నాయకులను చెదర గొట్టారు.
ఆంధ్రప్రదేశ్
పెద్దకడబూరులో స్వల్ప ఉద్రిక్తత


