హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీలేరు డివిజన్‌లో 26.87 శాతం పోలింగ్ నమోదు

అన్నమయ్య జిల్లా పీలేరు డివిజన్‌లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 9 గంటల వరకు 26.87 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.