హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రం వద్ద ఏజెంట్ల మధ్య వాగ్వాదం

PLD: సత్తెనపల్లి మండలం పాకాలపాడులో పోలింగ్ కేంద్రం వద్ద ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థి సుజాత వర్గీయులకు, పోలీసులకు మధ్య కూడా వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రత్యర్థి వర్గానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి రజిని ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించారంటూ సుజాత వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది.