KRNL: పెద్దకడబూరు మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మండలవ్యాప్తంగా 45,864 మంది ఓటర్లు ఉండగా, ఉదయం 9 గంటల వరకు 19,468 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మండల వ్యాప్తంగా 42.45 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యధికంగా ముచ్చిగిరి గ్రామంలో 59.2 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
పెద్దకడబూరులో 42.45 శాతం పోలింగ్ నమోదు


