ELR: ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామపంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికల సందర్భంగా పలువురు వృద్ధులను వీల్ చైర్లలో పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లారు. వయసు పైబడినా ఓటు హక్కును వినియోగించుకోవాలన్న వారి ఉత్సాహం అందరినీ ఆకట్టుకుంది. అధికారులు, సిబ్బంది వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. వీల్ చైర్ల ద్వారా సులభంగా ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
వీల్చైర్లలో వచ్చి ఓటేసిన వృద్ధులు


