NTR: స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. వత్సవాయి మండలం దబ్బాకుపల్లిలో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పాలుమాలు రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. అధికార పార్టీ ఒత్తిళ్లతోనే తమ పార్టీ నేతలను పోలీసులు నిర్బంధిస్తున్నారని వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ అభ్యర్థిని నిర్భందించారని YCP ఆరోపణ


