హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అల్లూరి ఏజెన్సీలో ఆటో బోల్తా.. ఒకరి మృతి!

విశాఖ: అల్లూరి జిలాలోని భీరం పంచాయతీ ఎన్నికల వేళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం సలీమారెంగి గ్రామం నుంచి భీరం వస్తుండగా ఘాట్ రోడ్డులో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కిల్లో రాజారావు(32) అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు వెళ్తున్నట్టు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.