VZM: జామి మండలం భీమసింగి గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి, పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
జామి మండలంలో జిల్లా ఎస్పీ పర్యటన


