హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాయసంపల్లెలో ఓటు వేసేందుకు అనుమతి లేదని ఆగ్రహం

కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం పాయసంపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన పలువురు ఓటర్లను అధికారులు అనుమతించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఓటు వేసే అవకాశం కల్పించాలని అధికారులను కోరారు. ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు.