హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంబాజీపేటలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ SP

కోనసీమ: అంబాజీపేట మండలంలో పోలింగ్ కేంద్రాలను అడిషనల్ SP మహేంద్ర మత్తే పరిశీలించారు. అంబాజీపేట ZP హైస్కూల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్ల గురించి పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలని, ఎటువంటి వివాదాలు తలెత్తకుండా భద్రత పెంచాలని ఆయన ఆదేశించారు.