మన్యం: సాలూరు మండలం తుండ పంచాయతీ పాఠశాల పరిసరాలు అపరిశుభ్రతకు నిలయంగా మారాయి. ప్రహరీ పక్కన ఉన్న కాలువల్లో చెత్త పేరుకుపోవడంతో మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. దోమల బెడద కూడా పెరగడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు అధికారులను కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాల వద్ద అపరిశుభ్రత.. విద్యార్థులకు అవస్థలు!


