హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నల్లచెరువు మండలంలో 9 గంటల వరకు పోలింగ్ ఎంతంటే..!

SS: నల్లచెరువు మండలంలోని 13 గ్రామ పంచాయతీల్లో రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 9 గంటల సమయానికి మొత్తం 25,317 ఓట్లకు గాను 4,931 ఓట్లు (19.48 శాతం) పోలయ్యాయి. అత్యధికంగా బలేపల్లితండాలో 31.06 శాతం, ఎం.అగ్రహారంలో 30.89 శాతం నమోదు కాగా, అత్యల్పంగా నల్లచెరువు పంచాయతీలో 3.84 శాతం పోలింగ్ నమోదైంది.