హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కలిసిన టీసీ వరుణ్

ATP: మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షుడు, అహుడా చైర్మన్ టీసీ వరుణ్, యువ నాయకుడు చైతన్య కృష్ణ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించారు. అనంతపురం జిల్లాలోని స్థానిక సమస్యలు, ప్రజల అవసరాలు, అభివృద్ధి అంశాలపై చర్చించి, మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.