హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

సూర్యోదయ కిరణాలతో రోగనిరోధక శక్తి రెట్టింపు

ఉదయం 6:30 నుంచి 8 లేదా 8.30 గంటల మధ్య వచ్చే లేత సూర్యరశ్మిలో కనీసం 15 నిమిషాలు గడపడం ఆరోగ్యానికి ఎంతో అవసరం. దీనివల్ల ఎముకల బలానికి కీలకమైన విటమిన్ డి సహజంగా లభిస్తుంది. అలాగే ఉదయపు వెలుతురు మెదడులోని సెరోటోనిన్ హార్మోన్‌ను పెంచి రోజంతా ఉల్లాసంగా ఉంచుతుంది. శరీర గడియారం(సర్కాడియన్ రిథమ్) సరిగ్గా పనిచేసి రాత్రిపూట గాఢ నిద్ర పట్టేందుకు ఇది తోడ్పడుతుంది.