హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

5 మండలాల్లో రెండో దశ పంచాయతీ ఎన్నికలు

గుంటూరు జిల్లాలో 5 మండలాల్లో రెండో దశ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమైనాయి. ఏకగ్రీవమైన 21 సర్పంచ్ స్థానాలు మినహా మిగతా 66 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ 66 స్థానాలకు 179 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 586 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటికే 348 వార్డులు ఏకగ్రీవంకాగా, 1247 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2,47,956 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.