హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 30న పోస్టల్ బ్యాలెట్ సెంటర్ ఏర్పాటు

E.G: రాజానగరం మండలంలో జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 30న స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో జేఏ ఝాన్సీ తెలిపారు. రాజానగరం మండలంలో ఓటు హక్కు ఉండి, ఇతర మండలాల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.