హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒకే ఇంటి కోడళ్లు.. ప్రజాప్రతినిధులు!

ATP: కలుగోడు గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు పి.విజయమ్మ, కాలవ వసంతమ్మ ఎంపీటీసీ సభ్యురాలిగా, సర్పంచిగా గెలిచారు. బాగనపల్లికి చెందిన వీరు కలుగోడులోని ఒకే ఇంటికి తోడికోడళ్లుగా వచ్చారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో ఆసక్తితో బరిలోకి దిగి విజయం సాధించారు. అక్క విజయమ్మ ఎంపీటీసీగా, చెల్లెలు వసంతమ్మ సర్పంచిగా ఎన్నికయ్యారు.