హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రారంభం!

కృష్ణా: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని అధికారులు కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛానీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగనుంది. మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.