హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీఎస్సీ ఉచిత ఆన్‌లైన్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

నెల్లూరులో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డీఎస్సీ-2026 (ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్) ఉచిత ఆన్‌లైన్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ సంక్షేమ అధికారి వెంకటలక్ష్మి తెలిపారు. డిసెంబరు మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయి. ఆసక్తిగలవారు ధ్రువీకరణ పత్రాలతో శోధన్‌నగర్‌లోని బీసీ స్టడీ సర్కిల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు 93815 54779, 80193 75443 నంబర్లను సంప్రదించండి.