W.G: తణుకు నియోజకవర్గంలో జరగనున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లోని 48 పంచాయతీలకు గాను 16 ఏకగ్రీవం కాగా, మిగిలిన 32 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1,59,643 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్
మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్!


