కడప నగరంలోని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఇద్దరు డీఎస్పీలు, పలువురు సీఐలు, పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. అకస్మాత్తుగా పోలీసుల మోహరింపుతో స్థానికంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, ఇంత భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడానికి గల కారణాలు తెలియరాలేదు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద భారీ పోలీసు బందోబస్తు


