హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోమశిల జలాశయానికి 405 క్యూసెక్కుల వరద

NLR: సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి శనివారం 405 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. జలాశయంలో గరిష్ట సామర్థ్యం 77.988 టీఎంసీలకు గాను ప్రస్తుతం 19.812 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, 289.511 అడుగుల నీటిమట్టం నమోదైంది. రివర్స్ స్లూయిస్ ద్వారా 50 క్యూసెక్కుల నీటిని డెల్టాకు విడుదల చేస్తుండగా, రోజుకు సగటున 89 క్యూసెక్కులు ఆవిరవుతున్నట్లు అధికారులు తెలిపారు.