నెల్లూరు జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 14 మండలాల్లోని 297 పంచాయతీలకు 93 ఏకగ్రీవం కాగా, నేడు 204 పంచాయతీల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. 4,29,165 మంది ఓటర్ల కోసం 2,714 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం పోలింగ్ ముగిశాక వెంటనే ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. సున్నిత ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం


