హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమవరం కాలువలో యువకుడి మృతదేహం లభ్యం

W.G: భీమవరం మెంటేవారితోట రెండో వార్డుకు చెందిన మైలబత్తుల రాజు (31) ఈ నెల 25 రాత్రి అదృశ్యమయ్యాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో వన్ టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. 27న గొల్లవానితిప్ప యనమదుర్రు కాలువలో మృతదేహం కనిపించగా, దుస్తులు, కుడిచేతిపై 'అమ్మ' పచ్చబొట్టు ఆధారంగా మృతుడు రాజుగా గుర్తించారు. ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందినట్లు భావిస్తున్నారు.