హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆటో బోల్తా.. మహిళ మృతి

ఏలూరు సమీపంలోని చోడిమెల్ల వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. చోడిమెల్లలో ఉన్న ఓ కళ్యాణ మండపంలో పూల డెకరేషన్ పనులు ముగించుకొని ఐదుగురు మహిళా కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే శ్రీదేవి అనే 60 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.