అన్నమయ్య జిల్లాలో రెండు విడతలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ తెలిపారు. 10 మండలాల పరిధిలో 151 పంచాయతీలకుగాను 1,612 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 21 సర్పంచ్, 751 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయని వెల్లడించారు. ఇవాళ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్, 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
21 ఏకగ్రీవం.. 151 చోట్ల ఎన్నికలు


