హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండో విడత పంచాయతీ ఎన్నికల వివరాలు

KRNL: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆదోని, కర్నూలు డివిజన్లలో ఎన్నికల వివరాలను కలెక్టర్ సిరి వెల్లడించారు. మొత్తం 186 గ్రామపంచాయతీల్లో 16 ఏకగ్రీవం కాగా, 170 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1,972 వార్డుల్లో 381 ఏకగ్రీవమై, 1,590 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్లు దాఖలు కాని వార్డు ఒక్కటి ఉన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.