హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదన వేణుగోపాలస్వామికి వైభవంగా పల్లకి సేవ

ప్రకాశం: పామూరు పట్టణంలోని రుక్మిణీ సమేత మదన వేణుగోపాలస్వామి ఆలయంలో శనివారం స్వామివారికి వైభవంగా పల్లకి సేవ నిర్వహించారు. తొలుత అర్చకులు ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారి పల్లకి సేవ భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.