W.G: పాలకొల్లు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు DSP ఎం.సుధాకర్ రావు తెలిపారు. సోమవారం ఏఎస్ఎన్ఎం కాలేజీలో కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో ఆయన CIలు రజినీకుమార్, శ్రీనివాస్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఇప్పటికే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 144 అమలులో ఉన్నాయని తెలిపారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి ర్యాలీలు, అనుమతి లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాలకొల్లులో కౌంటింగ్‌కు పటిష్ఠ భద్రత: DSP


