హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ ఓటు కోసం 10 కి.మీ నడక ప్రయాణం!

అల్లూరి: పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీకి చెందిన కిండలం, బొడ్డపుట్టు, కందులగుంట గ్రామ ప్రజలు 10 కి.మీ దూరంలో ఉన్న కుంతుర్ల ఎన్నికల కేంద్రానికి నడక మార్గంలో ప్రయాణం సాగిస్తున్నారు. తాత్కాలిక మట్టి రోడ్డు ఉన్నప్పటికీ తుఫాన్ల దాటికి కొట్టుకోనిపోయిందని, ద్విచక్ర వాహనాలు కూడా వెళ్ళే పరిస్థితి లేదని పంచాయతీకి మెరుగైన రోడ్డు నిర్మించి కష్టాలను తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.