AP: ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు మరణించగా మరొకరు గాయపడ్డారు. మృతులు అద్దంకి మండలం చెరుకుంపాలేనికి చెందిన వారు. బెంగళూరు నుంచి స్థానిక ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు సాయికుమార్, కామేశ్వరమ్మ, శ్రీనివాసరావు, పార్వతిగా గుర్తించారు.
వార్తలు
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం


