హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెంకట్రాయపురం సర్పంచ్‌గా వేణు ఏకగ్రీవంగా ఎన్నిక

E.G: పెరవలి మండలం పరిధిలోని వెంకట్రాయపురం పంచాయతీ సర్పంచ్ గా వేండ్ర వేణు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలోని అన్ని వర్గాలతో సన్నిహితంగా ఉండే వేణు సర్పంచ్‌గా ఎన్నిక కావడంపై వెంకట్రాయపురం గ్రామ ప్రజలు, అన్ని పార్టీల నాయకులు, కార్య కర్తలు హర్షం వ్యక్తం చేశారు. నమ్మకంతో ఎన్నుకున్న గ్రామ ప్రజల సంక్షేమానికి, గ్రామాభివృద్ధికి తోడ్పడతానని వేణు తెలిపారు.