హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

AP: రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభంకానుంది. 27 జిల్లాల్లో 52 రెవెన్యూ డివిజన్లలో 246 మండలాల్లో 3,880 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. 3,803 సర్పంచ్ స్థానాలకు 10,295 మంది.. 29,603 వార్డు సభ్యులకుగాను 63,395 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుంచి కౌటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.